Shock For Google & Facebook | సెర్చింజన్ గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం మెటా అనుబంధ ఫేస్‌బుక్‌కు ఫ్రాన్స్ దిమ్మదిరిగిపోయే షాక్ ఇచ్చింది. తమ చట్టాలకు భిన్నంగా బిజినెస్ పద్దతులు అవలంభిస్తున్నందుకు గూగుల్, ఫేస్‌బుక్‌లపై 210 మిలియన్ల యూరోలు (237 మిలియన్ల డాలర్లు) ఫైన్ విధించింది. గూగుల్, ఫేస్బుక్లతోపాటు టెక్ దిగ్గజాలు ఆపిల్, అమెజాన్ వ్యాపార పద్దతులపై యూరప్ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్నది. ఈయూ దేశాలన్నీ వీటిపై భారీ ఫైన్ విధిస్తున్నాయి. గూగుల్‌పై ఫ్రాన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఫ్రీడం (సీఎన్ఐఎల్) 150 మిలియన్ల యూరోల ఫైన్ విధించింది. 2020 డిసెంబర్లో ఒక కంపెనీ కుకీస్‌ను ట్రాక్ చేసినందుకు గూగుల్‌పై 100 మిలియన్ల యూరోల జరిమాన వేసింది.
ఫేస్‌బుక్‌పై 60 మిలియన్ల యూరోల ఫైన్ విధించింది సీఎన్ఐల్. ఫేస్బుక్ డాట్కాం, గూగుల్ డాట్ ఎఫ్ఆర్, గూగుల్ సారధ్యంలోని యూట్యూబ్ డాట్కాం యూజర్లు సింపుల్‌గా కుకీస్ వాడేందుకు అనుమతించడం లేదు. తమ పద్దతులు మార్చుకునేందుకు గూగుల్, ఫేస్‌బుక్‌లకు మూడు నెలల గడువు ఉంది. ఆ గడువులోగా వైఖరి మార్చుకోకుంటే రోజుకు లక్ష యూరోల జరిమానా విధిస్తామని సీఎన్ఐఎల్ స్పష్టం చేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా తమ పద్ధతులను మార్చుకుంటామని తెలిపింది.