హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లో అమర రాజా బ్యాటరీస్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునీక పరిశోధన, ఆవిష్కరణ కేంద్రం ‘ఈ ప్లస్ ఎనర్జీ ల్యాబ్స్‌కు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అమరరాజా సీఎండీ జయదేవ్ గల్లాతోపాటు ఆస్ట్రేలియన్ కాన్సుల్-జనరల్ హిలరీ మెక్‌గీచీ, నీతి ఆయోగ్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం) సలహాదారు సుధేందు సిన్హా తదితరులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ‘ఎవాల్వ్’ పేరుతో అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీలపై సదస్సు నిర్వహిస్తున్నారు.