ITR filing | గత ఆర్థిక సంవత్సరా (2021-22)నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సమయం దగ్గర పడుతున్నది. ఐటీ విభాగం ఈ-పైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి వెంటనే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు.. అయితే, ప్రతి రోజూ ఈ-మెయిల్స్ పాస్వర్డ్లు గుర్తుంటాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇంతకుముందు లాగిన్ ఓపెన్ చేసినా.. దాదాపు ఏడాది తర్వాత కాబట్టి మరిచిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో `ఆదాయం పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్ యూజర్లకు ఫర్గాట్ పాస్వర్డ్ సర్వీసు లభ్యం అవుతుంది` అని ఇన్‌కం టాక్స్ వెబ్సైట్ ప్రకటించింది.
ఈ సర్వీస్ ద్వారా.. పన్ను చెల్లింపుదారు తేలిగ్గా ఈ-ఫైలింగ్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఈ-పైలింగ్ ఓటీపీ, ఆధార్ ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ ఈవీసీ, డిమాట్ అకౌంట్ ఈవీసీ, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మరిచిపోయిన పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ మరిచిపోతే, దాన్ని రీసెట్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఆధార్ ఓటీపీ ద్వారా ఈ-ఫైలింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి స్టెప్ల వారీ గైడ్ అందుబాటులో ఉంది. పాన్ లేదా ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి.
దీని తర్వాత మీ స్క్రీన్ మీద సక్సెస్ మెసేజ్‌తోపాటు ట్రాన్సాక్షన్ ఐడీ డిస్ప్లే అవుతుంది. దాన్ని మీరు భవిష్యత్ సమాచారం కోసం ఏదో ఒక చోట తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి.