Gland Pharma | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న గ్లాండ్‌ఫార్మాలో మెజార్టీ వాటా కొనుగోలు చేయడానికి విదేశీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి బ్లాక్‌స్టోన్, బ్రోక్ఫిల్డ్, వార్బర్గ్ పింకస్ వంటి దిగ్గజాలు చర్చలు జరుపుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై ఫోసన్ ఫార్మా కు గ్లాండ్‌ఫార్మాలో ఉన్న ఈ వాటాను వదిలించుకోవడానికి సిద్ధమైంది. 2017లో 1.2 బిలియన్ డాలర్లతో 74 శాతం వాటా కొనుగోలు చేసిన చైనా సంస్థ.. ఆ తర్వాతి క్రమంలో ఈ వాటాను 51 శాతానికి తగ్గించుకున్నది.
ఇదే క్రమంలో మొత్తం వాటాను విక్రయించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం కంపెనీ విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఈ వాటా విక్రయానికి సంబంధించి మోర్గాన్ స్టాన్లీ, యూబీఎస్లను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా నియమించుకున్నది కూడా. డిసెంబర్ త్రైమాసికానికిగాను రూ. 1,384 కోట్ల ఆదాయంపై రూ.205 కోట్ల నికర లాభాన్ని గడించింది.