న్యూఢిల్లీ: ఇది కరోనా కాలం.. చాలా మంది మనీ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కానీ పర్సనల్ లోన్‌పై వడ్డీరేటు 10-24 శాతం మధ్య ఉంటుంది.
ఇటువంటి వారు ఇప్పటికే ఇంటి రుణం తీసుకుంటే.. దీనిపై టాపప్ లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని కింద తీసుకునే రుణంపై తక్కువ వడ్డీ వర్తిస్తుంది. ఈ తరుణంలో టాపప్ లోన్ తీసుకునే వారు దీనికి సంబంధించిన ప్రత్యేకాంశాలను తెలుసుకోవాలి.. అవేంటో చూద్దాం..
ఈ టాపప్ రుణంపై పర్సనల్ లోన్ మీద వడ్డించే వడ్డీరేటు కన్నా తక్కువ. పర్సనల్ లోన్‌పై వడ్డీ 10-24 శాతం మధ్య ఉంటుంది. కానీ ఇంటి రుణంపై టాపప్ లోన్ తీసుకుంటే వడ్డీ 7-9 శాతం ఉంటుంది.
ఈ టాపప్ రుణాలు హోం రెనోవేషన్, పిల్లల చదువులు, కూతురు వివాహం లేదా అదనపు ఆస్తుల కొనుగోళ్లకు ఉపయోగించొచ్చు. ఇంటి రుణంతోపాటు టాపప్ లోన్‌ను నెలవారీ వాయిదాల్లో చెల్లించొచ్చు.
టాపప్ రుణం 30 ఏండ్ల గడువు వరకు తీసుకోవచ్చు. వెసులుబాటుకు అనుగుణంగా తేలిగ్గా హోంలోన్తోపాటు తేలిగ్గా టాపప్ లోన్ తీసుకోవచ్చు.
మీరు టాపప్ లోను రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు. అయితే, అది మీ హోంలోన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత (పర్సనల్) రుణం గరిష్ఠంగా రూ.40 లక్షలు పొందొచ్చు. ఇబ్బందులు తలెత్తినప్పుడు డబ్బు అవసరమైతే టాపప్ రుణం తీసుకోవడమే సరైన చర్య.
ఇంటి రుణం తీసుకున్న తర్వాత కొంత కాలానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. ఇంటి రుణం చెల్లింపులను బట్టి బ్యాంకర్లు టాపప్ లోన్ ఇస్తాయి. సకాలంలో మీరు ఇంటి రుణ వాయిదాలు చెల్లిస్తే, టాపప్ లోన్ కూడా తేలిగ్గానే వస్తుంది.
టాపప్ లోన్ అంటే మనం మొబైల్ ఫోన్ల రీచార్జి వంటిదన్నమాట. తీసుకున్న ఇంటి రుణంతోపాటు టాపప్ రుణం వాయిదాల వారిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి రుణానికి ఉన్న నిబంధనలే టాపప్ లోన్కూ వర్తిస్తాయి.