Flipkart GOAT Sale | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్స్ హంగామా ‘గోట్ సేల్’ ఈ నెల 20- 25 తేదీల మధ్య జరుగనున్నది. మరో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఈ నెల 20,21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, టీవీలు, లాప్టాప్లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ నెల 19 అర్ధరాత్రి నుంచే సేల్స్ అందుబాటులో ఉంటాయి.
ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే రూ.50 డిస్కౌంట్ అందిస్తున్న ఫ్లిప్ కార్ట్.. 18 నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పించింది. ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ మెంబర్లకు సూపర్ కాయిన్స్ ఆఫర్లు ఉంటాయని వివరించింది.
ఈ సేల్స్ సందర్భంగా కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరలకే విక్రయిస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. పాత స్మార్ట్ ఫోన్లపై మెరుగైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎస్ఈ, వివో, ఒప్పో, మోటరోలా, ఇన్ఫినిక్స్ తదితర ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తామని ఫ్టిప్ కార్ట్ వెల్లడించింది.