Flifkart into Health Card | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. హెల్త్‌కేర్ రంగంలోకి సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న ఆన్లైన్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం www.sastasundar.comలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. కానీ రెండు సంస్థల మధ్య కుదిరే ఒప్పంద విలువను మాత్రం బహిర్గతం చేయలేదు. www.sastasundar.com సంస్థ 490 ఫార్మసీలు నిర్వహిస్తోంది.
www.sastasundar.comలో జపాన్‌కు చెందిన మిట్సుబిషీ కార్పొరేషన్, రోటో ఫార్మాస్యూటికల్స్ తదితర పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ అనే పేరుతో దేశవ్యాప్తంగా నాణ్యమైన, అందుబాటు ధరలో హెల్త్‌కేర్ సేవలందిస్తామని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్‌లో తమ సేవలను ఈ-డయాగ్నస్టిక్స్, ఈ-కన్సల్టేషన్కూ విస్తరిస్తామని తెలిపింది.