న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ న్యూ బిగ్ దివాళీ సేల్ ఈవెంట్ మరోసారి అక్టోబర్ 19 నుంచి ప్రారంభమై 23 వరకూ కొనసాగనుంది. కంపెనీ ఇటీవల తన దివాళీ సేల్‌ను ముగించగా తక్కువ ధరలో ఉత్పత్తులను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్‌తో ముందుకొస్తోంది. ఇక ప్లస్ మెంబర్షిప్ ఉన్నవారికి ఒకరోజు ముందుగానే సేల్ ఈవెంట్ యాక్సెస్ ఉంటుంది.
గత సేల్స్‌లో అమలైన డీల్స్ తాజా సేల్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. పోకో X4, ఇతర స్మార్ట్ఫోన్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజ్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్22+ ప్లస్, ఐఫోన్ 13 వంటి ప్రీమియం ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయి. టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి వివిధ యూనిట్లపై ఏకంగా 80 శాతం వరకూ సేల్‌లో ఆఫర్లు ఉంటాయి.
ఎంపిక చేసిన నాయిస్ స్మార్ట్‌వాచ్‌లపై 20 శాతం ఆఫర్‌తో పాటు ల్యాప్‌టాప్‌లపై ఆకర్షణీయ డిస్కౌంట్ లభించనుంది. సేల్‌లో భాగంగా హెచ్‌పీ ఐ3 ల్యాప్‌టాప్ 512జీబీ వేరియంట్ వరకూ రూ 35,990కి లభిస్తుండగా, లెనోవా రైజెన్ రూ 44,990కి అందుబాటులో ఉంది. రూ 7649 ప్రారంభ ధరతో శాంసంగ్ ఐపీఎస్ మానిటర్లు సేల్‌లో ఉన్నాయి. దివాళీ సేల్ సందర్భంగా ఎస్బీఐ బ్యాంక్ కార్డులు, పేటీఎం లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.