Flipkart Big Billion Days Sale | ఫెస్టివ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ ఆఫర్ల బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) లతో ఫ్లిప్కార్ట్ జత కట్టింది. ఈ మూడు బ్యాంకుల కార్డులతో, ఈఎంఐ ఆప్షన్లతో జరిగే కొనుగోళ్లపై పదిశాతం ఇన్స్టంట్ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది. పేటీఎం, ఇతర యూపీఐ వాలెట్లతో జరిపే కొనుగోళ్లపైనా ఈ ఇన్స్టంట్ డిస్కౌంట్లు లభిస్తాయి. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది ఫ్లిప్కార్ట్.
ఆపిల్ ఐ-ఫోన్ (iPhone), ఐక్యూ (iQoo), వన్ప్లస్ (One Plus), శాంసంగ్ (Samsung), రియల్మీ (Realme), షియోమీ (Xiaomi) తదితర బ్రాండ్లు విడుదల చేసే కొత్త బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ నెల 27 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. ఇక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు అందరికంటే ముందే యాక్సెస్ లభిస్తుంది.
ఆపిల్ (Apple), శాంసంగ్ (Samsung), గూగుల్ (Google), రియల్మీ (Realme), ఒప్పో (Oppo), షియోమీ (Xiaomi), నథింగ్ (Nothing), వివో (Vivo) బ్రాండ్లపై అందుబాటులో ఉన్న పలు స్మార్ట్ ఫోన్లపై 80 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు.
మోటో జీ54 5జీ (Moto G54 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G), రియల్మీ సీ 51 (Realme C51), రియల్మీ 11 5జీ (Realme 115G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G), ఇన్ ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G), మోటో జీ84 5జీ (Moto G84 5G), వివో వీ 29ఈ (Vivo V29e), పొకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) ఫోన్లపై ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్కార్ట్.
ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 series), ఐఫోన్ 13 సిరీస్ (iPhone 13) ఫోన్లపైనా ధరల తగ్గింపు ఉంటుంది. శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా (Samsung Galaxy S23 Ultra) పైనా రూ.92 వేల వరకూ (బ్యాంకు ఆఫర్లతో కలిపి) ధర తగ్గింపు అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7), గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ (Google Pixel 6) ఫోన్లపైనా డిస్కౌంట్లు లభిస్తాయి. అక్టోబర్ ఒకటో తేదీన ఐఫోన్, మూడో తేదీన శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు వెల్లడిస్తుంది. ఇక షియోమీ ఫోన్లపై ఏడో తేదీన, గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఐదో తేదీన డిస్కౌంట్లు ప్రకటిస్తారు.