BOB Tiranga FD | భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. `బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్` ప్రారంభించింది. లిమిటెడ్ టైం పీరియడ్‌లో మాత్రమే ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద రూ.లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి రూ.1.28 లక్షలు లభిస్తుంది. ఇక ఖాతాదారులు ఈ పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నది. రెండు టెన్యూర్లతో `బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్` ప్రజలకు అందుబాటులో ఉంది. 444 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 5.75 శాతం, 555 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఆరు శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిక్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది. నాన్-కాలబుల్ డిపాజిట్ల ( Non-Callable )పై అదనంగా 0.15 శాతం వడ్డీ పొందొచ్చు.