Triptii Dimri | పాపులర్ ఫ్యాషన్ యాక్సెసరీస్ బ్రాండ్ Victoria’s Secretకు యానిమల్ భామ తృప్తి డిమ్రి తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకమైన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ రీసెంట్గా ఇప్పుడు ఇండియాలో సరికొత్త ఐకానిక్ సెక్సీ కలెక్షన్స్‌ను లాంచ్ చేసి నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ కోసం బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో మెరిసింది తృప్తి డిమ్రి. బ్లాక్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో డైమండ్ జ్యువెలరీ, సాఫ్ట్ వేవ్స్, రేడియేటింగ్ బోల్డ్ అవతార్‌లో గ్లామరస్‌గా కనిపిస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
ఢిల్లీలోని ఆంబియెన్స్ మాల్స్ విక్టోరియా సీక్రెట్ వద్ద కొత్త కలెక్షన్ లాంచ్ చేశారు. సెక్సీ కలెక్షన్లు ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే స్వయం వ్యక్తీకరణను మరింత పెంపొందించే విధంగా చేస్తాయని తృప్తి డిమ్రి చెప్పుకొచ్చింది. తృప్తి డిమ్రి ఈ ఏడాది ఓ రోమియో, మా బెహన్ సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

The Stunning Triptii Dimri at Ambience Mall, Delhi as the first-ever Indian brand ambassador for Victoria’s Secret to launch the 25th anniversary of their Very special collection!✨🖤#Tripti #TriptiiDimri pic.twitter.com/yalgfWiRM6
— glam (@Glamreel) August 20, 2026