హైదరాబాద్, మే 23: యాపిల్‌కు సంబంధించిన ఉత్పత్తుల విక్రయ సంస్థ అప్ట్రానిక్స్..హైదరాబాద్‌లో తొలి యాపిల్ ప్రీమియం స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్‌లో యాపిల్‌కు సంబంధించిన ఐఫోన్లతోపాటు మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, ఇతర విడిభాగాలు కూడా లభించనున్నాయి.
ఈ స్టోర్ ప్రారంభ సందర్భంగా కనీసంగా 12 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు యాపిల్ కేర్ సర్వీసులపై 50 శాతం తగ్గింపు ధరతోపాటు పాత స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఎక్సేంజ్‌పై రూ.10 వేల వరకు బోనస్‌ను పొందవచ్చునని అప్ట్రానిక్స్ ఫౌండర్ సుతిందర్ సింగ్ తెలిపారు.