మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 29, 2021 , 22:29:10

10 నెల‌ల్లో గ‌రిష్ఠంగా ఎఫ్ఐఐల సెల్లింగ్‌

10 నెల‌ల్లో గ‌రిష్ఠంగా ఎఫ్ఐఐల సెల్లింగ్‌

న్యూఢిల్లీ/ ‌ముంబై: ఎకాన‌మీ రిక‌వ‌రీ జాప్యం అవుతుంద‌న్న సందేహాల మ‌ధ్య విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు (ఎఫ్ఐఐ) శుక్ర‌వారం ఒక్క‌రోజే దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో రూ.5,930.7 కోట్ల పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. ఇది గ‌త 10 నెల‌ల్లో గ‌రిష్ఠం. కొవిడ్ ఆందోళ‌నల మ‌ధ్య గ‌తేడాది మార్చి 13వ తేదీ ఒక్క‌రోజే గ‌రిష్ఠంగా 6,027 కోట్ల పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకున్నారు. ఆ త‌ర్వాత ఒక రోజే ఎఫ్ఐఐలు ఉప‌సంహ‌రించుకోవ‌డ‌మే 2021 జ‌న‌వ‌రి 29నే.

శుక్ర‌వారం దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల ఒత్తిడికి గురి కావ‌డంతో నిఫ్టీ-50, బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఒక శాతానికి పైగా ప‌త‌న‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ స్థానిక ఈక్విటీల్లో ఎఫ్ఐఐల పెట్టుబ‌డులు 300 కోట్ల డాల‌ర్ల పై చిలుకే ఉంటాయి. ఆదాయం పెంచుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన ప్ర‌వేశ‌పెట్టనున్న వార్షిక బ‌డ్జెట్‌లో కార్పొరేట్లు, అత్య‌ధిక ఆదాయం సంపాద‌న ప‌రుల‌పై కొవిడ్‌-19 సెస్, నూత‌న టాక్స్‌లు విధించ‌నున్న‌ద‌న్న ఆందోళ‌న‌ల మ‌ధ్యే ఎఫ్ఐఐలు త‌మ పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకున్నార‌ని వార్త‌లొచ్చాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo