హైదరాబాద్, జూన్ 11: రాంకీ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు..ఫిక్కీ స్మార్ట్ అర్బర్ ఇన్నోవేషన్ అవార్డు 2024 వరించింది. హైదరాబాద్‌లోని జవహార్ నగర్లో ఉన్న లెగసీ లీచేట్ శుద్ది యూనిట్ గణనీయమైన వృద్ధిని గుర్తింపులో భాగంగా సంస్థకు ప్రస్తుతేడాదికిగాను ‘సస్టెయినబుల్ సిటీస్’ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏడో ఎడిషన్ స్మార్ట్ అర్బన్ ఇన్నోవేషన్ అవార్డు కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు ఈ అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డుకోసం రాంకీతోపాటు 10 ఆర్గనైజేషన్లు, ముఖ్యంగా కార్పొరేట్లు, ప్రభుత్వ ఏజెన్సీలు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు పోటీపడ్డాయి. వ్యర్థాలు కుల్లిపోవడం వల్ల వచ్చే విషపూరితమైన పదార్థాలతో సమీపంలోని నీటి వనరులతోపాటు భూగర్బ జలాలు కూడా కలుషితం కావడం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పువాటిల్లే అవకాశం ఉన్నదని పేర్కొంది. దీనిని నివారించడానికి రాంకీ 2 వేల కేఎల్డీ లీచేట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఇక్కడే నిర్వహిస్తున్నది.