FICCI Survey | గిరాకీని ప్రోత్సహించడానికి, వృద్ధిని పెంపొందించడానికి ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సమీక్షించాలని ఫిక్కీ (FICCI) నిర్వహించిన సర్వేలో మెజారిటీ వ్యక్తులు చెప్పారు. ప్రజల చేతుల్లో మరింత మనీ ఉండటంతోపాటు వినియోగం పెరగడానికి టాక్స్ రేట్లు, శ్లాబ్‌లపై రీలుక్ చేయాలని సర్వేలో పాల్గొన్న పలువురు వ్యక్తులు తెలిపారు. ‘ఫిక్కీ ఫ్రీ బడ్జెట్ 2025-26’ అనే పేరుతో నిర్వహించిన సర్వేలో వేర్వేరు రంగాలకు చెందిన 150 కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.5-6.9 శాతం మధ్య ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్నవారు అంచనా వేశారు. పన్ను విధానాన్ని సరళతరం చేయాలని సెర్వేలో పాల్గొన్న మెజారిటీ వ్యక్తులు చెప్పారు. గ్రీన్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్‌లు పెంచాలని కోరారు. డిజిటలైజేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియ తేలికయ్యేలా చూడాలని అభిప్రాయ పడ్డారు.
కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు, టీడీఎస్ నిబంధనలను హేతుబద్ధీకరించాలని, కోరారు. కస్టమ్స్ విధానంలో ఆమ్నెస్టీకి స్కీంకు మద్దతు పలికారు. త్వరిగతిన వివాదాల పరిష్కారానికి 54 శాతం మంది అనుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.