Niti Aayogh Oppose Fiber Network | లక్షద్వీప్‌కు ఫైబర్ ఆఫ్టిక్ నెట్వర్క్.. నీతి ఆయోగ్ నో.. అందుకేనా?!
Niti Aayogh Oppose Fiber Network | కోచ్చి-లక్షద్వీప్ మధ్య కేబుల్ ప్రాజెక్టులో భారతకంపెనీలు పాల్గొనకుండా టెండర్ షరతులు సిద్ధం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ మేడిన్ ఇండియా అంటారు. కానీ ఆయన సారధ్యంలోని టెలికం శాఖ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. కేరళలోని కోచ్చి – కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను అనుసంధానించేందుకు 1,772 కి.మీ. పొడవునా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ నిర్మాణం చేపట్టింది. ఇది వ్యూహాత్మకంగా దేశానికి ముఖ్యమైంది. రూ.1,072 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా భారత్ కంపెనీలు పాల్గొనకుండా డాక్యుమెంట్ సిద్ధం చేశారని డీఆర్డీవో మాజీ చీఫ్.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అభియోగం. దేశీయ కంపెనీలు పాల్గొనకుండా రూపొందించిన టెండర్ విధానంతో ఈ ప్రాజెక్టు విశ్వసనీయతే ప్రశ్నార్థకం అంటున్నారాయన. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందంటున్నారు. అందుకే వివక్షాపూరితంగా తయారుచేసిన ఈ టెండర్ విధానాన్ని వీకే సారస్వత్ వ్యతిరేకిస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టుకు టెమా
టెలికం శాఖ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో టెలికం ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (టెమా) సవాల్ చేసింది. ఈ ప్రాజెక్టు టెండరింగ్ సందేహాలకు తావిస్తున్నదని పేర్కొంటూ గత ఏప్రిల్‌లో టెలికం శాఖకు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ బహిరంగ లేఖ కూడా రాశారు.

ఉద్దేశపూర్వకంగానే ఆ షరతులు
దేశీయంగా సురక్షితమైన ఆర్థికంగా శక్తిమంతమైన, విశ్వసనీయమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలని సారస్వత్ తన లేఖలో తెలిపారు. టెండర్ నిబంధనలు మారిస్తే బీఎస్ఎన్ఎల్ టెండర్ దాఖలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కానీ టెండర్ షరతులు మాత్రం ఉద్దేశపూర్వకంగా దేశీయ కంపెనీలను దూరం పెట్టేలా ఉన్నాయని స్పష్టం చేశారు.
కోచి-లక్షద్వీప్ అనుసంధానానికి..
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ స్కీమ్ ప్రకటించారు. కోచి నుంచి సముద్ర మార్గం మీదుగా లక్ష్యద్వీప్‌లోని 11 దీవులను కలిపేందుకు దీన్ని ప్రతిపాదించారు. ఈ-కామర్స్, సుపరిపాలనను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఈ ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే లక్షద్వీప్ వాసులకు 100జీబీపీఎస్ స్పీడ్ బ్యాండ్‌విడ్త్‌తో మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- niti aayogh
- vk saraswat
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

