FDI inflows | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ మార్కెట్లలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఎస్) 34 శాతం తగ్గి 10.94 బిలియన్ డాలర్లకు చేరాయి. కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ సాఫ్ట్ వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి.
2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎఫ్డీఐ పెట్టుబడులు 16.58 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 40.55 శాతం తగ్గి 9.28 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.
2023 ఏప్రిల్ లో 5.1 బిలియన్ డాలర్లకు, మేలో 2.67 బిలియన్ డాలర్లకు జూన్ నెలలో 3.16 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2022 ఏప్రిల్ లో 6.46 బిలియన్ డాలర్లు, మేలో 6.15 బిలియన్ డాలర్లు, జూన్ నెలలో 3.98 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
ఈక్విటీ మార్కెట్లు, ఇతర పెట్టుబడి మార్గాల్లోనూ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. 2022-23 ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో 22.34 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ పెట్టుబడులు.. 2023-24 తొలి త్రైమాసికంలో 21.4 శాతం తగ్గి 17.56 బిలియన్ డాలర్లతో సరి పెట్టుకున్నాయి. అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యూఏఈ) వంటి ప్రధాన దేశాల నుంచి ఎఫ్డీఐ పెట్టుబడులు తగ్గిపోయాయి.