హైదరాబాద్, జూన్ 15: వండర్లా.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 19న ఫాదర్స్ డే రోజున మూడు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఒక్క టిక్కెట్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ హైదరాబాద్ పార్క్‌తోపాటు బెంగళూరు, కొచ్చి పార్క్‌లలో కూడా లభించనున్నది.
దీంతోపాటు పదొ తరగతి, ఇంటర్ పరీక్షలు హాజరైన విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లు చూపించి ప్రవేశ టిక్కెట్టుపై 35 శాతం రాయితీ పొందవచ్చునని సూచించింది. ఈ ఆఫర్లు ఈ నెల 30 వరకు అమలులో ఉండనున్నది. వీటితోపాటు 22 ఏండ్ల లోపు విద్యార్థులు తమ కళాశాల ఐడీని చూపించి టిక్కెట్‌పై 20 శాతం తగ్గింపు పొందవచ్చును.