e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home బిజినెస్ భాగ్యనగరంలో ఫార్మ్‌ఈజీ సెంటర్‌

భాగ్యనగరంలో ఫార్మ్‌ఈజీ సెంటర్‌

  • 200 మంది ఉద్యోగులను నియమించుకోనున్న సంస్థ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13: దేశంలో అతిపెద్ద ఈ-ఫార్మసీ సంస్థ ఫార్మ్‌ఈజీ…హైదరాబాద్‌లో నూతన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు పుణె, ఎన్‌సీఆర్‌లలో ఈ సెంటర్లను ఒకేసారి ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మూడు డెవలప్‌మెంట్‌ సెంటర్ల కోసం 200 మంది ఇంజినీర్లను నియమించుకోనున్నట్లు పేర్కొంది. హెల్త్‌కేర్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్న ఈ సంస్థ..ముఖ్యంగా అవుట్‌పెటెంట్‌ హెల్త్‌కేర్‌ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వినూత్న టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హెల్త్‌కేర్‌ రంగంలో వస్తు న్న వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ట్లు, ముఖ్యంగా డిజిటల్‌-ఫస్ట్‌ ఇండియాలో భాగంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ కో-ఫౌండర్‌ హార్దీక్‌ దేధియా తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెంటర్లలో పరిశోధన రంగంపై మరింత దృష్టి సారించడానికి వీలు పడనున్నదన్నారు. ప్రస్తుతం సంస్థలో 6,100 మందికిపైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana