హైదరాబాద్, నవంబర్ 3: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాబెక్స్ స్టీల్..తెలంగాణలో తన తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. నగరానికి సమీపంలోని చిట్యాల వద్ద రూ.120 కోట్లతో పెట్టుబడితో 40 ఎకరాల విస్థీర్ణంలో నెలకొల్పిన ప్లాంట్‌ను సోమవారం ప్రారంభించింది. 50 వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌తో 400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ కో-ఫౌండర్, ఎండీ వేణు చావా తెలిపారు. ఈ ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి పైగా ఉపాధి అవకాశాల లభించనున్నాయన్నారు.
నూతన యూనిట్ అందుబాటులోకి రావడంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనుండటంతో ఈ సారి రూ.1,000 కోట్ల టర్నోవర్ అంచనావేస్తున్నట్టు తెలిపారు. అలాగే వచ్చే మూడేండ్లలో ప్లాంట్ల సామర్థ్యాన్ని రెండింతు పెంచుకోవడానికి మరో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో ఈ సంఖ్యను రెండింతలు 800కి పెంచుకోనున్నట్టు తెలిపారు.