ముంబై, మార్చి 25: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఆయన గతేడాది సెప్టెంబర్‌లో అరస్టైన విషయం తెలిసిందే. గతేడాది చివర్లో బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిగా, మళ్లీ ఇప్పుడు జస్టిస్ పీడీ నాయక్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.3 లక్షలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.