కోల్‌కతా, మార్చి 21: జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి సిద్ధమైంది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో ప్రతియేటా కొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ రెండు మాడళ్లు కాంప్యాక్ట్ సెడాన్, సెడాన్ వాహనాలను విక్రయిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతం వృద్ధి అంచనావేస్తున్న కంపెనీ.. 92 వేల యూనిట్లు అమ్ముడవుతాయని ఆశిస్తున్నది. అలాగే టర్కియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, పశ్చిమాసియా దేశాలకు తన వాహనాలను ఎగుమతి కూడా చేస్తున్నది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎగుమతుల వాటా 25 శాతంగా ఉన్నదని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని వ్యాఖ్యానించారు.