Evergrande crisis | ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న చైనా రియాల్టీ సంస్థ ఎవర్‌గ్రాండే విదేశీ పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లింపులు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. ఇన్వెస్టర్ల బాండ్లపై బుధవారానికి వరుసగా రెండోసారి 47.5 మిలియన్ల డాలర్ల వడ్డీ చెల్లించడంలో విఫలమైంది. దీనిపై స్పందించడానికి ఎవర్‌గ్రాండే అధికార ప్రతినిధి నిరాకరించారు. గత గురువారం 83.5 మిలియన్ల డాలర్ల బకాయిలు చెల్లించలేకపోయింది.
అయితే దేశీయ బ్యాంకుతో రూ.1.5 బిలియన్ల డాలర్ల రుణం చెల్లింపులపై ఎవర్‌గ్రాండే ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తున్నది. విదేశాల్లో 20 బిలియన్ల డాలర్ల మేరకు ఈ సంస్థ రుణాలు చెల్లించాల్సి ఉన్నది. ఈ సంస్థ అప్పులు సుమారు 305 బిలియన్ల డాలర్లు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం చైనాలో ఇండ్ల కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నది.