Shashi Ruia | ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు (Essar Group co founder) శశి రుయా (Shashi Ruia) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో మంగళవారం ఉదయం మృతి చెందారు. దిగ్గజ వ్యాపారవేత్త మరణం పట్ల ఎస్సార్ గ్రూప్ సంతాపం ప్రకటించింది. ‘శశికాంత్ రుయా మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. సమాజ అభ్యున్నతి, దాతృత్వం పట్ల తిరుగులేని నిబద్ధతతో ఆయన సేవలు అందించారు. ఆయన జీవిత కాలంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. రుయా మరణవార్త తెలుసుకున్న పలువురు వ్యాపారవేత్తలు, దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
శశి రుయా.. 1943లో జన్మించారు. 1969లో తన సోదరుడు రవి రుయాతో కలిసి ఎస్సార్ గ్రూప్‌ను స్థాపించారు. అతి తక్కువ సమయంలోనే తమ సేవలను అనేక రంగాల్లోకి విస్తరించారు. ఇక ఈ గ్రూప్ చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం. వీరి ప్రాజెక్టుల్లో ఇది ప్రధానమైంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2.5 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో ఎస్సార్ గ్రూప్‌నకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆతర్వాత డబుల్ బ్రిడ్జీలు, భారీ వంతెనలు, పవర్ ప్లాంట్లతో సహా అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్మించింది. 1980వ దశకంలో ఎస్సార్ అనేక చమురు, గ్యాస్ ఆస్తులను కొనుగోలు చేయడంతో ఇంధన రంగంలోకి విస్తరించింది. 1990 ల్లో స్టీల్, టెలికమ్మూపికేషన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది.
Also Read..
Mumbai Terror Attack | 26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు
AR Rahman | ఆయన నాకు తండ్రిలాంటి వారు.. రెహమాన్‌తో రిలేషన్ షిప్ వార్తలపై మోహినీ దే క్లారిటీ
Samantha | నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు.. డివోర్స్ తర్వాత ఎన్నో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నా : సమంత