న్యూఢిల్లీ, జూలై 9: గతకొద్ది నెలలుగా దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి వచ్చే పెట్టుబడులు క్రమేణా క్షీణిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత నెల జూన్‌లో 24 శాతం పెరిగి ఫండ్ ఇన్‌ఫ్లో రూ.23,587 కోట్లుగా నమోదైంది. అంతకుముందు వరుసగా 6 నెలలపాటు ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం నెలనెలా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబర్లో రూ.41,156 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.39,688 కోట్లు, ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, మార్చిలో రూ.25,082 కోట్లు, ఏప్రిల్‌లో రూ.24,269 కోట్లు, మే నెలలో రూ.19,013 కోట్లుగా ఉన్నాయి. నిరుడు నవంబర్‌లో రూ.35,943 కోట్లుగా ఉండగా, డిసెంబర్లో పెరిగాయి. మళ్లీ ఆ తర్వాత జూన్‌లోనే పెరుగుదల కనిపించింది. ఇక ఎంఎఫ్‌ల్లోకి నెలనెలా ఎంతోకొంత పెట్టుబడులు నికరంగా రావడం వరుసగా ఇది 52వ నెల అని అసోసియేషన్ చెప్తున్నది.
సిప్‌లకు భలే ఆదరణ
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)లోకి వస్తున్న పెట్టుబడుల్లో నెలనెలా ఆరోగ్యకరమైన వృద్ధిరేటు కనిపిస్తుండటం విశేషం. జూన్‌లోనూ రూ.27,269 కోట్లు వచ్చాయి. మే నెలలో ఇవి రూ.26,688 కోట్లుగా ఉన్నాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి..