EPFO Alert | ఈపీఎఫ్ స్కీంలో సవరణలు.. 23 లక్షల మందికి బెనిఫిట్..?!
EPFO Alert | వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లలో సర్వీసు నుంచి పదేండ్లలోపు వైదొలిగిన ఉద్యోగులకు ఈపీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలను సడలించారు.
EPFO Alert | వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్లకు ఉద్యోగ పెన్షన్ పథకం నిబంధనలు సడలించారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎఫ్)-1995 ప్రకారం ఆరు నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నా.. విత్ డ్రాయల్స్ బెనిఫిట్లు అందిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. తత్ఫలితంగా ప్రతి సంవత్సరం దాదాపు ఏడు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర కార్మికశాఖ వెల్లడించింది. పదేండ్ల లోపే ఉద్యోగం మానేసే ఉద్యోగులకూ విత్ డ్రాయల్ గణాంకాల్లోనూ ఈపీఎఫ్ఓ మరో మార్పు తీసుకొచ్చిందని కార్మికశాఖ వివరించింది.
ఈపీఎఫ్ఓలో పదేండ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికే పెన్షన్ అర్హత లభిస్తుంది. అంత మేరకు వారికి ఫించను లభిస్తుంది. కొద్ది కాలానికే ఉద్యోగం మానే వారిలో ఆరు నెలల పాటు ఈపీఎఫ్ లో తమ వాటా డిపాజిట్ చేసిన వారు మాత్రమే ఇప్పటి వరకూ విత్ డ్రాయల్ ప్రయోజనాలు పొందుతున్నారు. ఆరు నెలలు, అంత కన్నా తక్కువ టైంలోనే ఉద్యోగాన్ని వీడే వారికి విత్ డ్రాయల్ బెనిఫిట్లు అందడం లేదన్న విమర్శలు ఉన్నారు. తత్ఫలితంగా పలువురు సబ్ స్క్రైబర్ల క్లయిమ్ లు తిరస్కరణకు గురవుతున్నాయని ఈపీఎఫ్ఓ గుర్తించింది. కేవలం గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోనే ఏడు లక్షల మంది క్లయిమ్‌లు రిజెక్ట్ కావడంతో నిబంధనలు సవరించామని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ చట్టం -1995లోని టేబుల్-డీ కి ఈపీఎఫ్ఓ కొన్ని సవరణలు తెచ్చింది. పదేండ్ల లోపు సర్వీసు మాత్రమే కల వారు తమ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్మును ‘టేబుల్-డీ’ ప్రకారం లెక్క కట్టి చెల్లిస్తారు. పదేండ్ల సర్వీసు కాకముందే ఉద్యోగానికి రాజీనామా చేసినా, రిటైరైనా ఈపీఎఫ్ తీసుకోవాలనుకుంటే ఆ ఉద్యోగి సర్వీసు పరిగణనలోకి తీసుకుని లెక్క గట్టి పే చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం సదరు ఉద్యోగి పని చేసిన నెలల ఆధారంగా లెక్క కట్టి చెల్లిస్తారు. తత్పలితంగా ముందస్తు విత్ డ్రాయల్స్ మీద వచ్చే మొత్తం సొమ్ము తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి :
Electricity Bills | ఇక ఆ సిస్టమ్‌తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్‌కు కోకా కోలా గుడ్‌బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

