సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న లాజిస్టిక్ టెక్ స్టార్టప్ కంపెనీ ఎన్మోవిల్ సొల్యూషన్స్ రూ.10 కోట్ల నిధులను సమీకరించింది. ఫ్రీ సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా యానికట్ ఏంజెల్ ఫండ్ ఆధ్వర్యంలో కేసీటీ గ్రూప్, బ్లాక్‌బర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి నిధులు ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. ఈ సందర్బంగా ఎన్మోవిల్ సొల్యూషన్స్ స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందకిశోర్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా లాజిస్టిక్ రంగంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను అందించడమే లక్ష్యంగా సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఈ నిధులను కూడా వీటికోసం వెచ్చించనున్నట్లు ఆయన ప్రకటించారు.