హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో భాగంగా టీ హబ్‌లో టీఏంజిల్, రుబ్రిక్స్ పేరుతో రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా టీఏంజిల్ కింద 20 స్టార్టప్‌లను, రుబ్రిక్ కింద 13 స్టార్టప్‌లను ఎంపిక చేశామని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. టీ ఏంజిల్ కోసం మొత్తం 675 స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు రాగా, అందులోని 20 ఉత్తమ స్టార్టప్‌లను, రుబ్రిక్స్కు 325 దరఖాస్తులు రాగా, వాటిలోంచి 13 స్టార్టప్‌లను ఎంపిక చేసి టీ హబ్‌లో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. వీటిలో ఫ్రెండ్పే, ఎన్‌పే, బిల్లీయో, ప్రోమోడీ, కెరీర్ ఫోర్జ్, ఈ-సన్‌రైజ్ ఆటో ఇండస్ట్రి, మెడైడ్ టెక్నాలజీస్, గ్రేస్వైప్, రోబోకలామ్, లుక్రియా కన్సల్టింగ్, ఆక్టలిస్ట్, సబ్కో, కిసాన్ దాస్ ఉన్నాయి.