Tesla- Elon Musk | త్వరలో భారత్‌లో టెస్లా యూనిట్.. ఈ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తారా..?!
Tesla- Elon Musk | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Tesla- Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ త్వరలో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నదని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో గుజరాత్లో జరిగే ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులో ‘టెస్లా ప్లాంట్’పై ఓ ప్రకటన వెలువడనున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా గుజరాత్ లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేశాయి. గుజరాత్‌తోపాటు తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు అవకాశాలను టెస్లా పరిశీలించినట్లు సమాచారం.
మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈవీ కార్ల తయారీ ఎగుమతులకు అనుకూల వ్యవస్థ ఉన్నా.. టెస్లా యాజమాన్యం మాత్రం గుజరాత్‌లోనే ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తున్నది. కాండ్లా, ముంద్రా నౌకాశ్రయాలు ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు గుజరాత్ తమకు అనువైన రాష్ట్రం అని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గుజరాత్ లోని సనంద్, ధొలెరా, బెచరాజీ ప్రాంతాల్లో తన ప్లాంట్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నది. తొలుత విదేశాల నుంచి కార్లను దిగుమతి చేయనున్నది. అటుపై దేశీయంగా కార్ల తయారీ చేపడుతుందని తెలుస్తోంది.
టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు విషయమై వచ్చేనెలలో జరిగే వైబ్రంట్ గుజరాత్ సదస్సులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో టెస్లా తన కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

