న్యూయార్క్ : ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను గాడినపెట్టేందుకు చెమటోడుస్తున్నాడు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన మరుక్షణమే కీలక మార్పులు చేపట్టిన మస్క్ కంపెనీ సమూల ప్రక్షాళన దిశగా తీరికలేకుండా గడుపుతున్నాడు. కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులను తొలగించడం, బ్లూటిక్కు చార్జ్ చేయడం వంటి చర్యలతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న మస్క్ తన నిర్ణయాలను సమర్ధించుకున్నాడు.
కంపెనీ ప్రస్తుతం సరైన దిశలోనే పయనిస్తోందని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్‌ను గాడినపెట్టేందుకు తాను వారానికి ఏడు రోజులు పూర్తి సమయం పనిచేస్తున్నానని తన ముందు చాలా పనిఉందని, దాన్ని పూర్తిచేయకతప్పదని మస్క్ పేర్కొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ..వారానికి ఏడు రోజులు పనిచేస్తున్నానని మస్క్ వెల్లడించాడని బ్లూమ్బార్గ్ రిపోర్ట్ తెలిపింది.
పనిలో తనను తాను హింసించుకుంటున్నానని, తన లాగా ఎవరూ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ట్విట్టర్, టెస్లా, స్పేస్ఎక్స్, ది బోరింగ్ కో, న్యూరాలింక్ కార్ప్ వంటి ఐదు కంపెనీలను మేనేజ్ చేస్తూ ఊపిరిసలపని పనిలో కూరుకుపోయాడు.