GrokAI : ఎక్స్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ త్వరలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్లందరికీ అందుబాటులో ఉంటుందని ఎలన్ మస్క్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా మస్క్ ఈ విషయం వెల్లడించారు. గ్రోక్ఏఐ ఎక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో మస్క్ పేర్కొన్నారు.
గ్రోక్ఏఐ ఇటీవల ఓపెన్ సోర్స్ చేయబడగా, గిట్‌హబ్‌లో ఓపెన్ రిలీజ్ అందుబాటులోకి వచ్చింది. ఏఐ మోడల్ ఓపెన్‌సోర్స్ చేయబడటం అంటే దాని సోర్స్ కోడ్‌ను సవరణలు, రీడిస్ట్రిబ్యూషన్ కోసం పబ్లిక్కు ఆఫర్ చేయడమని అర్ధం.
ఫలితంగా గ్రోక్ఏఐని మెరుగుపరిచేందుకు రీసెర్చర్లు, డెవలపర్లు కసరత్తు సాగించే వెసులుబాటు కలుగుతుంది. గ్రోక్ఏఐ ఓపెన్సోర్సింగ్కు సంబంధించి ఎక్స్ఏఐ ఇటీవల బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. బేస్ మోడల్ వెయిట్స్, గ్రోక్-1 నెట్వర్క్ ఆర్కిటెక్చర్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ రిలీజ్ చేస్తున్నామని బ్లాగ్‌పోస్ట్‌లో ఎక్స్ఏఐ టీం తెలిపింది.
Read More :
Metro Rail | నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు..