Bloomberg Rankings | ప్రపంచ కుబేరుడిగా సాఫ్ట్వేర్ దిగ్గజం, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు. ఎలాన్ మస్క్‌ను దాటి ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. ఒరాకిల్ షేర్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దాంతో ఎలిసన్ సంపద అనేక బిలియన్ డాలర్లు పెరగడంతో ఎలాన్ మస్క్‌ను దాటేసి ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఎలిసన్ సంపద ఇప్పుడు 393 బిలియన్ డాలర్లు. ఈ మొత్తం సంపద ఎలాన్ మస్క్ కంటే ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్కువ. నాలుగేళ్ల కింద ఎలాన్ మస్క్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన నికర విలువ 385 బిలియన్ డాలర్లు. మంగళవారం వరకు మస్క్ ప్రధాన సంస్థ అయిన టెస్లా షేర్లు 14శాతం తగ్గాయి.
కృత్రిమ మేధస్సు పోటీలో కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల ఆర్డర్లు ఆధారంగా ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికను చూపించింది. దాంతో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మస్క్ ఇప్పటికీ 439 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, బ్లూమ్‌బెర్గ్ తన సంపదను 385 బిలియన్లుగా చూపించింది. ఫోర్బ్స్-బ్లూమ్‌బెర్గ్ రెండూ మస్క్ ప్రైవేట్ కంపెనీలను (స్పేస్ఎక్స్-ఎక్స్ వంటివి) వేర్వేరుగా అంచనా వేయడం తేడాలు ఉన్నాయి. ఎలిసన్‌కు ఒరాకిల్‌లో దాదాపు 40 శాతం వాటాను ఉంది. అంటే స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే దాని పెరుగుతున్న షేర్లు ఆయన నికర విలువకు వంద బిలియన్ డాలర్లు జోడించింది. కంపెనీ తన ఆదాయాలను నివేదించినప్పుడు 300 బిలియన్లకు పైగా విలువైన కొత్త ఒప్పందాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఆదాయం 77 శాతం పెరిగి 18 బిలియన్లకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
నాలుగు సంవత్సరాలలో ఇది 144 బిలియన్లకు పెరుగుతుందని ఎల్లిసన్ పేర్కొన్నారు. మరో వైపు మస్క్ పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో కంపెనీ ఆశించిన బూమ్ ఇంకా కనిపించలేదు. మస్క్ నిరంతరం పెట్టుబడిదారుల దృష్టిని టెస్లా రోబోట్, కృత్రిమ మేధస్సు ప్రాజెక్టుల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ప్రతికూల వార్తలు ఆగడం లేదు. ఈ వేసవి ప్రారంభంలో యూరోపియన్ యూనియన్‌లో టెస్లా అమ్మకాలు 40 శాతం తగ్గాయి. వరుసగా ఏడో నెలలోనూ తగ్గాయి. మస్క్ ఎక్స్‌లో నేరపూరిత రాజకీయ నాయకులకు మద్దతు ఇచ్చిన తర్వాత కస్టమర్లు దూరమవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంపై చాలామంది కోపంగా ఉన్నారు. దాంతో కొనుగోలుదారులు టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కంపెనీ యూఎస్ మార్కెట్లో వాటా కోల్పోతూ వస్తున్నది.