Elon Musk | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గుత్తాధిపత్యానికి కుట్ర .. మైక్రోసాఫ్ట్.. ఓపెన్ ఏఐలపై ఎలన్ మస్క్ దావా..!
Elon Musk | చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఇందులో మైక్రోసాఫ్ట్ ను ప్రతివాదిగా జత చేశారు.
Elon Musk | చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఈ న్యాయ పోరాటంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ ఈ నెల 14న నార్త్రర్న్ కరోలినా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓపెన్ ఏఐ మాజీ బోర్డ్ మెంబర్ – ప్రస్తుతం న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివాన్ జిలిస్ తో కలిసి ఎలన్ మస్క్ పిటిషన్ వేశారు. శివాన్ జిలిస్ సైతం తాను ఓపెన్ ఏఐ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు సంస్థ యాజమాన్యం మార్గ నిర్దేశంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తొలుత నాన్ ప్రాఫిట్ మిషన్ లక్ష్యంతో ఓపెన్ ఏఐ ప్రారంభమైంది. కానీ మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ ప్రారంభ లక్ష్యాల నుంచి తప్పుకుని వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎలన్ మస్క్ ఆరోపించారు. ప్రత్యర్థి ఏఐ సంస్థలకు నిధులు లభించకుండా, సున్నితమైన సమాచారం షేర్ చేయకుండా నిరోధించడంతోపాటు ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని మస్క్ అభియోగం. లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్, మైక్రోసాఫ్ట్ యాజమాన్యం కలిసి రెండు కంపెనీల్లో ద్వంద్వ భాగస్వామ్యాన్ని నిరోధించాలని ఎలన్ మస్క్ తన పిటిషన్ లో కోరారు.
గత మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కోర్టులో ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఎలన్ మస్క్.. ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఉపసంహరించుకున్నారు. తాజాగా ఫెడరల్ చట్టాలను ఓపెన్ ఏఐ ఉల్లంఘిస్తున్నదంటూ, తనను డీఫ్రాడ్ చేయడానికి కుట్ర చేస్తున్నదంటూ ఫెడరల్ కోర్టులో కొత్తగా దావా వేశారు. దీనిపై ఓపెన్ ఏఐ గానీ, హాఫ్ మన్ గానీ స్పందించలేదు. మైక్రోసాఫ్ట్ స్పందించేందుకు నిరాకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

