EV Sales | 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వాహనాల విక్రయాలు పెరిగాయి. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 6,261 విద్యుత్ కార్లు అమ్ముడు పోవడం సరికొత్త రికార్డు. 2020-21తో పోలిస్తే 234 శాతం సేల్స్ పెరిగాయి. గతేడాది కేవలం 1872 ఈవీ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈవీ కార్ల సేల్స్‌లో టాప్‌లో టాటా నెక్సన్ ఈవీ నిలిచింది. ఈ ఏడాది 3,618 యూనిట్ల టాటా నెక్సన్ కార్లు విక్రయించింది టాటా మోటార్స్. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది సేల్స్ 214 శాతం అధికం. రెండో స్థానంలో ఎంజీ మోటార్స్ జడ్ఎస్ నిలిచింది. ఈ ఏడాది 1,789 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2020-21తో పోలిస్తే ఈ ఏడాది 250 శాతం సేల్స్ పెరిగాయి. 801 యూనిట్ల (701 శాతం) అమ్మకాలతో టాటా టిగోర్ ఈవీ, హ్యుండాయ్ కోనా 51 కార్ల విక్రయంతో నాల్గో స్థానంలో ఉంది. కానీ గతేడాదితో పోలిస్తే 50 శాతం సేల్స్ తగ్గాయి.