Ola Scooter | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. లిమిటెడ్ ఎడిషన్‌గా 24 క్యారెట్ బంగారంతో తయారైన ఎస్1 ప్రొ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
‘సేవింగ్స్ వాలాస్కూటర్ కా్ంయపెన్’లో భాగంగా విడుదల చేసిన సోనా ఎడిషన్‌గా స్కూటర్ కొన్ని మాడళ్లు మాత్రమే విక్రయించనున్నది. ఈ నెల 25న ఒకేరోజు దేశవ్యాప్తంగా 4 వేల స్టోర్లను ప్రారంభించనున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను వేగవంతం చేసింది.