శాన్ఫ్రాన్సిస్కో: టెస్లా కార్ల కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది 13 లక్షల వాహనాలను డెలివరీ చేసినట్లు ఆ కంపెనీ చెప్పింది. 2021తో పోలిస్తే గత ఏడాది 40 శాతం ఎక్కువ సంఖ్యలో వాహనాల్ని అమ్మినట్లు పేర్కొన్నది. గత ఏడాది చివరి మూడు నెలల్లోనే ఆ కంపెనీ సుమారు 4 లక్షల వాహనాల్ని డెలివరీ చేయడం విశేషం. అయితే ఈ ఏడాది మాంద్యం ప్రభావం ఉండనున్న నేపథ్యంలో.. వాహనాల అమ్మకాలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల్లోనూ తమ సరఫరాను నిలిపివేయలేదని టెస్లా కంపెనీ తన ప్రకటనలో పేర్కొన్నది.