హైదరాబాద్, నవంబర్ 8: రాష్ర్టానికి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.2 శాతం ఎగబాకి రూ.49.54 కోట్లకు చేరుకున్నట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇది రూ.47.56 కోట్లుగా ఉన్నది. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.523.6 కోట్ల నుంచి 25.4 శాతం వృద్ధితో రూ.656.6 కోట్లకు చేరుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. గత త్రైమాసికంలో సంస్థ 375 బస్సులను డెలివరీ చేసింది. అలాగే ప్రస్తుతం కంపెనీ చేతిలో 9,818 వాహనాల ఆర్డర్ బుకింగ్ కలిగివున్నది.