న్యూఢిల్లీ, ఆగస్టు 2: రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ రుణ ఎగవేత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో తొలి వికెట్ డౌన్ అయింది. బిశ్వాల్ ట్రేడ్లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ సారథి బిశ్వాల్ను అదుపులోకి తీసుకున్నది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ నుంచి బీటీపీఎల్కు రూ.5.4 కోట్ల నిధులు మళ్లించినట్టు గుర్తించిన ఈడీ..కంపెనీ అధినేతను ప్రశ్నించడానికి అరెస్ట్ చేసింది. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన మరుసటి రోజే ఈ అరెస్ట్ చేయడం విశేషం.