హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఫాల్కన్ ఇన్వాయిస్ డిసౌంటింగ్ సీమ్ కుంభకోణంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) శరద్ చంద్ర తోష్నివాల్ను అరెస్టు చేసినట్టు గురువారం ప్రకటించారు.
అమర్ దీప్‌కుమార్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో అధిక రాబడుల ఆశజూపి అమాయక పెట్టుబడిదారులను మోసం చేశారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. కాగా, తోష్నివాల్ను ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.