న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: సరుకు రవాణాలో అగ్రగామి సంస్థగా వెలుగొందడానికి డెలివరీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంట్లోభాగంగా తన పోటీ సంస్థయైన ఈకామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ.1,407 కోట్లు. షేర్ల కొనుగోలు ద్వారా జరగనున్న ఈ ఒప్పందం వచ్చే ఆరు నెలల్లో పూర్తికానున్నట్లు వెల్లడించింది. ఈ కొనుగోలు ఒప్పందానికి కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, కొనుగోలు అనంతరం ఈకామ్ సంస్థ యథావిధిగానే తన సేవలను కొనసాగించనున్నదని, అలాగే సబ్సిడరీగా కొనసాగుతుందని డెలివరీ ఎండీ, సీఈవో సైద్ సాహిల్ బారు తెలిపారు. ఇరు సంస్థల క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయనున్నట్టు… మౌలిక సదుపాయల కల్పన, టెక్నాలజీ, నెట్వర్క్, ఉద్యోగాలను నియమించుకోవడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు.