Ducati Monster SP | సూపర్ అండ్ స్పోర్టీ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ.. భారత్ మార్కెట్లోకి మరో బైక్ మంగళవారం తీసుకు రాబోతున్నది. `డుకాటీ మాన్స్టర్ ఎస్పీ (Ducati Monster SP)` అనే పేరుతో ఈ బైక్ వస్తున్నది. పలు ఇతర బైక్‌లతోపాటు మాన్స్టర్ ఎస్పీ బైక్‌ను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తామని డుకాటీ ప్రారంభంలో వెల్లడించింది. `డుకాటీ మాన్స్టర్ ఎస్పీ` ధర రూ.15.95 లక్షలుగా ఉంటుంది.
డుకాటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం `డుకాటీ మాన్స్టర్ ఎస్పీ` బైక్.. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్యూయల్ ట్యాంక్‌పై ఫ్రంట్ ఇండికేటర్లు ఉంటాయి. 973 సీసీ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ 9250 ఆర్పీఎం వద్ద 110 బీహెచ్పీ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 93 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పైరెల్లి డియాబ్లో రొస్సో 4 టైర్స్‌తో వస్తున్న ఈ బైక్ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో నడుస్తుంది.
డుకాటీ మాన్స్టర్ ఎస్పీ బైక్ అల్ ఎల్ఈడీ లైటింగ్, 4.3 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే విత్ మల్టీ మీడియా సిస్టమ్, లాంచ్ కంట్రోల్, ఏబీఎస్ కార్నరింగ్, లిథియం అయాన్ బ్యాటరీ, త్రీ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, వీల్ కంట్రోల్, డుకాటీ క్విక్ షిఫ్ట్ అప్/ డౌన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.