సీటీఎస్‌తో రెడ్డీస్ ఒప్పందం

యాంటి-క్యాన్సర్ ఏజెంట్ హక్కుల విక్రయంపై డీల్
హైదరాబాద్, సెప్టెంబర్ 4: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరెటరీస్.. అమెరికా కంపెనీ సీటీఎస్ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక యాంటి క్యాన్సర్ ఏజెంట్ హక్కుల్ని, సంబంధిత ఆస్తుల్ని విక్రయించేందుకు ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు రెడ్డీస్ శనివారం తెలిపింది. ఒప్పందం ప్రకారం లావాదేవీ పూర్తయినవెంటనే 40 బిలియన్ డాలర్లు రెడ్డీస్‌కు లభిస్తాయి. తదుపరి రోజుల్లో ఆ క్యాన్సర్ ఏజెంట్‌కు లభించే అనుమతులకు అనుగుణంగా 70 మిలియన్ డాలర్ల వరకూ రెడ్డీస్‌కు సిటియస్ చెల్లిస్తుంది. అలాగే అమ్మకాలకు సంబంధించిన మైల్స్టోన్ చెల్లింపులు, ఆ డ్రగ్‌పై వచ్చే లాభాల్లో చెల్లింపులు ఉంటాయని కంపెనీ ప్రకటన తెలిపింది. ఈ777గా వ్యవహరించే ఈ యాంటీ-క్యాన్సర్ ఏజెంట్‌పై గ్లోబల్రైట్స్ను ఇసై కో లిమిటెడ్ నుంచి 2016 మార్చిలో రెడ్డీస్ కొనుగోలు చేసింది. అటుతర్వాత దీనిని ఔషధంగా అభివృద్ధిపర్చడంలో గణనీయమైన ప్రగతి సాధించామని, సీటీసీఎల్ క్యాన్సర్ చికిత్సకు ఈ ఔషధాన్ని సీటీఎస్ ఫార్మా సిద్దంచేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు రెడ్డీస్ ల్యాబ్ సీఈవో ఇరాజ్ ఇజ్రాయిల్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- anti cancer
- CTS
- reddys
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

