న్యూఢిల్లీ, జూలై 14: జాతీయ స్టార్టప్ అవార్డుల ఐదో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) సోమవారం తెలియజేసింది. కేవలం వాణిజ్యపరమైన విజయాలకేగాక.. సామాజిక, సామర్థ్యం, సుస్థిరతలకు కూడా ఈ అవార్డులు ప్రతిబింబంగా నిలుస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నది.
కాగా, ఈ అవార్డుల కోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియ కఠినంగా, బహుళ దశల్లో ఉంటుందని, వ్యవసాయ, క్లీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆరోగ్య, విద్య, సైబర్‌సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవార్డులను ఇవ్వనున్నారు.