DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమన్నదంటే..?!
DOT | సిమ్ కార్డు సర్వీసు నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్లు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి.. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర టెలికం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ ను నమ్మొద్దని హితవు చెప్పింది.
DOT | సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి.. మరో రెండు గంటల్లో కేంద్ర టెలికం శాఖ మీ సిమ్ కార్డ్ సర్వీసు నిలిపేస్తుందని చెబుతున్నారు. అలా జరుగొద్దంటే తాము అడిగిన వివరాలు చెప్పాలంటున్నారు. అలాంటి వారి మాటలు నమ్మిన మొబైల్ యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటాతో సైబర్ మోసగాళ్లు పలు రకాల మోసాలు చేస్తున్నారని కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలిపింది.
ఇటువంటి కాల్స్ ను నమ్మొద్దని పేర్కొంటూ మొబైల్ యూజర్లకు టెలికం శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇటువంటి కాల్స్ వస్తే మొబైల్ ఫోన్ యూజర్లు తమ నెట్ వర్క్ ప్రొవైడర్‌ని సంప్రదించాలని సూచించింది. యూజర్ల వ్యక్తిగత డేటా తాము సేకరించబోమని, సిమ్ కార్డు సర్వీసుల విషయమై వచ్చే మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది.
మోసపూరిత కాల్స్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ)కి ఫిర్యాదు చేయాలని డాట్ పేర్కొంది. ఇటువంటి మోసపూరిత కాల్స్‌ను అరి కట్టడానికి తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

