Money | అసలు ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు? ఐటీ చట్టాలు ఏం చెప్తున్నాయి?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలో మీకు తెలుసా?.. పరిమితికి మించి నగదు నిల్వలతో కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని గుర్తుంచుకోండి. నిజానికిది డిజిటల్ లావాదేవీల యుగం. మొబైల్, బ్యాంకింగ్ యాప్లతోనే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టేస్తున్నారు మరి.
Money | ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలో మీకు తెలుసా?.. పరిమితికి మించి నగదు నిల్వలతో కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని గుర్తుంచుకోండి. నిజానికిది డిజిటల్ లావాదేవీల యుగం. మొబైల్, బ్యాంకింగ్ యాప్లతోనే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టేస్తున్నారు మరి. అయినప్పటికీ ఇంకా చాలామంది తమ అవసరాలకు నగదునే ఎంచుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఇంట్లో నగదు నిల్వలకున్న పరిమితులు ఏమిటీ?.. అసలు ఆదాయ పన్ను (ఐటీ) చట్టాలు ఏం చెప్తున్నాయి.
ఎంతైనా పెట్టుకోవచ్చు.. కానీ
మీరు కోరుకున్నంత నగదును మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టాలు ఇందుకు ఎటువంటి పరిమితుల్నీ విధించలేదు. నిజానికి ఇంట్లో నగదును ఉంచుకోవడం అక్రమమేమీ కాదు. కానీ మీ దగ్గరున్న నగదు మొత్తం సక్రమమైన మార్గాల్లోనే ఆర్జించినదై ఉండాలి. ఐటీ దాడులు జరిగినప్పుడు ఆ నగదు నిల్వలు ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయో వివరించగలగాలి. ఒకవేళ మీవద్ద సమాధానం లేకపోయినైట్టెతే.. మీపై చట్టపరమైన చర్యలు తప్పవు. మీ దగ్గరున్న సదరు అపరిమిత నగదు నిల్వల్ని నల్లధనంగా పరిగణించి కేసులు పెడతారు. నేరం రుజువైతే కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు ఉండనే ఉంటాయి.
అక్రమ సొమ్ము బయటపడితే..
చాలామంది ఇండ్లలో పెద్ద ఎత్తున నగదు నిల్వల్ని పెట్టుకుంటూంటారు. కొందరికిదో అలవాటైతే.. మరికొందరికి తప్పని పరిస్థితి. అయితే ఈ నగదు నిల్వలు అక్రమమని తేలితే.. పట్టుబడ్డ నగదుకు 37 శాతం అధికంగా.. అంటే గరిష్ఠంగా 137 శాతం వరకు జరిమానాగా విధించే వీలున్నది. ఉదాహరణకు ఒక ఇంట్లో రూ.5 కోట్ల అక్రమ నగదు దొరికితే.. దానికిగాను రూ.6.85 కోట్లు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు జైలుశిక్షకూ ఆస్కారమున్నది.
- ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-మార్చి)లో రూ.20 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరుపరాదు. ఇంతకుమించితే జరిమానాలు తప్పవు.
- పాన్, ఆధార్ వివరాలేవీ లేకుండా ఒక ఏడాదిలో రూ.20 లక్షలకుపైగా డిపాజిట్లు చేస్తే.. రూ.20 లక్షలదాకా ఫైన్ పడవచ్చు.
- పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలివ్వకుండా బ్యాంకుల్లో నుంచి ఒకేసారి రూ.50 వేలకుపైగా నగదును డిపాజిట్గానీ, విత్డ్రాగానీ చేయలేము.
- నగదు లావాదేవీల్లో రూ.2 లక్షలకు మించి కొనుగోళ్లు జరుపలేము. ఒకవేళ జరుపాల్సి వస్తే కొనుగోలుదారు తమ పాన్, ఆధార్ వివరాలివ్వాల్సిందే.
- ఒకరోజులో మీ బంధువుల దగ్గర్నుంచి కూడా రూ.2 లక్షలకుపైగా నగదును తీసుకోలేరు. అలాగే ఇందుకోసం బ్యాంకింగ్ లావాదేవీలు తప్పనిసరి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

