న్యూఢిల్లీ, జనవరి 2: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక పనితీరు కనబరిచింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,247.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,304.58 కోట్ల ఆదాయంతో పోలిస్తే 17.18 శాతం పెరిగింది. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో 341 స్టోర్లను నిర్వహిస్తున్నది.