హైదరాబాద్, అక్టోబర్ 18: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..దీపాళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘జోయ్ యొక్క దీపావళి’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ చేసే డైమండ్ & అన్ కట్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై ఒక గ్రాము గోల్డ్ కాయిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు.
రూ. 50 వేలు అంతకంటే ఎక్కువ విలువ చేసే గోల్డ్ & ప్రెషస్ జ్యువెలరీ కొనుగోళ్లపై రూ. 1,000 గిఫ్ట్ వోచర్, రూ. 10 వేలు అంతకంటే ఎక్కువ విలువ గల సిల్వర్ జ్యువెలరీ కొనుగోళ్లపై రూ. 500 గిఫ్ట్ వోచర్ కూడా పొందవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా కస్టమర్లు కేవలం 10% ముందస్తు చెల్లింపుతో ప్రస్తుత గోల్డ్ రేట్‌కు లాక్ చేయవచ్చని వెల్లడించారు. షాపర్స్ తమ పాత గోల్డ్‌ను 100% హెచ్‌యూఐడీ 916 హాల్ మార్క్ కలిగిన జ్యువెలరీతో మార్చుకోవచ్చని సూచించారు.