హైదరాబాద్, మే 17: ఓటీటీ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని డిష్ టీవీ సరికొత్తగా ‘డిష్ టీవీ స్మార్+’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకే ప్లాన్ కింద ఓటీటీ, టీవీ చానెళ్లను ఎక్కడైన, ఎప్పుడైన తిలకించవచ్చునని పేర్కొంది. ఓటీటీ సేవలతోపాటు టీవీ సబ్స్క్రిప్షన్ సేవలు అందించడం ఇది తొలిసారి కావడం విశేషం.
ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ యాప్‌లను ఎంచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఇందుకోసం అదనంగా చెల్లింపులు జరుపాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టంచేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా సెట్-టాప్ బ్యాక్స్, స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎస్టీబీతో ఈ సేవలు పొందవచ్చునని తెలిపింది.