హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..బంగారు ఆభరణాల తరుగు చార్జీలపై 50 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న జోస్ ఆలుక్కాస్కు చెందిన అన్ని షోరూంలలో లభించనున్నది. దీంతోపాటు వజ్రాలపై 20 శాతం, ప్లాటినమ్పై 7 శాతం తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ మాట్లాడుతూ..బంగారు ఆభరణాలు కొనడానికి ఇదే సరైన సమయమని, ఈ ప్లాట్ 50 శాతం తగ్గింపుతో కస్టమర్లకు అత్యున్నత నాణ్యత కలిగిన ఆభరణాలను అనువైన ధరకు సొంతం చేసుకోవచ్చునన్నారు.