హైదరాబాద్, జూలై 1: ఈ ఏడాది మార్చి31నాటికి ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ ఎంతన్నది జూలై 15కల్లా వెల్లడించగలమని ఆ సంస్థ తెలిపింది. ఎంబడెడ్ విలువ గణింపు పూర్తికాగానే, సంబంధిత అనుమతులు పొందిన అనంతరం జూలై 15కల్లా వెల్లడించగలమని భావిస్తున్నట్టు శుక్రవారం ఎల్ఐసీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
2021 సెప్టెంబర్ 30 నాటికి ఎల్ఐసీ ఎంబడెడ్ విలువ రూ. 5.4 లక్షల కోట్లుగా అంతర్జాతీయ సంస్థ మిల్లీమాన్ అడ్వయిజర్స్ లెక్కించింది.